బుల్లితెర హీరోయిన్ కరోనా టిప్స్
అనుభవాన్ని మించినది మరేది ఉండదు. కరోనా బారినపడినవారు కూడా తమ అనుభవాలని షేర్ చేసుకుంటున్నారు. కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇలా చేయండి. కరోనాకి దూరంగా ఉండండని సూచిస్తున్నారు. బుల్లితెర హీరోయిన్ నవ్య స్వామి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుంది. తాజాగా నవ్య స్వామి కరోనా అనుభవాలని పంచుకొంది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది.
‘కరోనా పాజిటివ్ అని తేలాక చాలా టెషన్ పడ్డాను. ఏడ్చాను. మా అమ్మ కూడా ఏడ్చింది. ఒక్కసారిగా జీవితం అస్తవ్యస్తంగా మారింది.నా సహనటులని, నా సిబ్బందిని ఇబ్బందుల్లోకి నెట్టానని గిల్టీగా ఫీలయ్యాను. అయితే కరోనా సోకినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. దైర్యంగా ఉంటూ చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ఇమ్యునిటీ పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకుంటున్నా’నని చెప్పింది.