గుడ్ న్యూస్ : ఆగస్టు 15కల్లా తెలంగాణలో కరోనా వాక్సిన్
దేశానికి, ప్రపంచానికి తెలంగాణ కరోనా వాక్సిన్ అందించబోతుందని గత కొన్నాళ్ల క్రితం సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిదే. ఈ మేరకు హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్, తదితర కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ చెప్పినంత త్వరగా కాదు.. కానీ భారత్ బయోటెక్ నుంచి ఆగస్టు 15కల్లా కరోనా వాక్సీన్ రాబోతుంది. క్లినికల్ ట్రైల్స్‌ని వేగవంతం చేసేందుకు భారత్ బయోటెక్‌తో కలిసి పనిచేయనున్నట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈమేరకు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ భారత్ బయోటెక్‌కి లేఖ రాశారు.
ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో కరోనా వైరస్ నివారణ కోవ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రి-క్లినికల్ దశను పూర్తి చేసి, మొదటిదశ, రెండో దశ పరీక్షలకు అనుమతి పొందింది. క్లినికల్ టెస్ట్‌లో కరోనాని నివారించగలిగితే ఆగస్టు 15 నాటి కల్లా వ్యాక్సిన్ విడుదల చేయాలని ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ భావిస్తున్నాయి.