కోర్టుని ఆశ్రయించిన రఘు రామకృష్ణం రాజు
నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుపై వేటు వేసేందుకు వైసీపీ రెడీ అవుతోంది. పార్టీ ధికార స్వారాన్ని వినిపిచిన రాజుకి వైసీపె షోకాజ్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. దీనిపై 15రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తనకి అందిన షోకాజ్ నోటీసుపై రఘు రామకృష్ణ రాజు ఫైర్ అయ్యారు. అసలు పార్టీ అస్థిత్వాన్నే ప్రశ్నించారు.
యువజన రైతు శ్రామిక పార్టీ తరఫున తాను ఎన్నికయ్యాయని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్‌హెడ్‌పై తనకు షోకాజ్ నోటీసు ఎలా ఇచ్చారు ? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వద్ద రాష్ట్రపార్టీగా గుర్తింపు పొందిన వైసీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు ? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘం వద్ద ఇవే ప్రశ్నలని అడిగారు.
అయితే ఇప్పుడు రఘు రామకృష్ణ రాజు హైకోర్టు ఆశ్రయిమ్చారు. తనపై అనర్హత వేటు, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. తాను పార్టీ వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని పిటిషన్లో పేర్కొన్నారు. తనకి షోకాజ్ అందించిన విషయంలో కొన్ని ప్రశ్నలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని, ఈసీ నిర్ణయం తీసుకునే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని పిటిషన్లో కోరారు.