జియోలో ఇంటెల్ భారీ పెట్టుబడులు

టెలికాం సంచలనం జియోలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జియోలో ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్‌, కేకేఆర్, ముబదాలా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఎల్ కాటర్‌టన్‌, వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.

తాజాగా ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్‌కు చెందిన ‘ఇంటెల్‌ క్యాపిటల్‌’ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.39 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ. 1,894 కోట్లు.  ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సాంకేతిక కంపెనీలతో పనిచేసిన అనుభవం ఇంటెల్‌ క్యాపిటల్‌కు ఉందని ఈ సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అన్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రజలకు అత్యాధునిక సాంకేతికతను చేరువచేయడంలో వారి అనుభవం జియోకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.