ఏపీ మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్ !

ఏపీ కేబినేట్ లో రెండు స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. రాజ్యసభకు ఎన్నికైన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ మంత్రి పదవులకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలని భర్తీ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం ఆషాడం మాసం. అదిపోయి శ్రావణం రాగానే మంత్రివర్గ విస్తరణ ఉండనుందని సమాచారమ్. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని తెలిసింది.

శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభం అవుతుండగా… 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కాబట్టి కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ఎంపిక చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే.. ఎమ్మెల్యే రోజాకి మరోసారి నిరాశ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. రోజా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు అన్నది తెలిసిందే.