బ్రేకింగ్ : జగన్’పై పవన్ ప్రశంసలు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. కరోనా విజృంభిస్తున్న గడ్డుకాలంలో సీఎం జగన్ పనీరు అద్భుతమంటూ ట్విట్ చేశారు. ‘ఇది ప్రపంచానికే గడ్డు కాలం. అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ, రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలికి, సహకరిద్దాం-క్షేమంగా ఉందాం’మని పవన్ ట్విట్ చేశారు.

“ఆం. ప్ర గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం  ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం. అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం’ అంటూ పవన్ వరుస ట్విట్లు చేశారు. బహుశా.. సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు కురిపించడం బహుశా.. ఇదే తొలిసారి కావొచ్చు.