స్టార్ హోటల్’లో రేవ్ పార్టీ.. మంత్రి అల్లుడు అరెస్ట్ ?
బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్లో ఆదివారం అర్థరాత్రి రేవ్ పార్టీ జరిగింది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి.. పవురిని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రముఖ హోటల్లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో శనివారం రాత్రి పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి దాడులు చేశారు. అక్కడ ఓ గదిలో మద్యం తాగుతూ లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఒకేచోట పలువురు గుమిగూడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారిలో సంతోష్‌రెడ్డి, భానుకిరణ్, విజయరామారావు, రఘువీర్‌రెడ్డి, ఉక్రెయిన్‌కు చెందిన ఓ యువతి, మరో ముగ్గురు పాతికేళ్లలోపు యువతులున్నారు. వారిని విచారించగా.. జన్మదినం సందర్భంగా హోటల్లో స్నేహితులతో కలిసి వేడుక నిర్వహించినట్లు వెల్లడించారని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వివరించారు. యువతులను రెస్క్యూహోంకి తరలించారు. అయితే ఈ దాడిలో తెలంగాణకి చెందిన ఓ మంత్రి అల్లుడుని అరెస్ట్ చేసినట్టు సమాచారమ్. మరోవైపు మంత్రి అల్లుడుని ఈ కేసు నుంచి కావాలని తప్పించారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.