మంత్రి తలసానిని కలిసిన టీవీ ప్రొడ్యూసర్స్ కమిటీ

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన మంత్రి తలసాని గొప్ప మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 2వేల మంది బుల్లితెర నటీనటులకి నిత్యవసర సరుకులని అందజేశారు. ఈ నేపథ్యంలో తాజాగా టీవీ ప్రొడ్యూసర్ సంఘం నేతలు మంత్రి తలనసానిని కలిసి కృతజ్ఝతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

షూటింగ్‌ల సమయంలో భౌతిక దూరం పాటించాలి. శానిటైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలి. స్వయం నియంత్రణతోనే నిర్మూలన సాధ్యమని మంత్రి చెప్పినట్టు తెలిసింది. ఇక ఇటీవల కాలంలో పలువురు టీవీ నటీనటులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా కొన్ని టీవీ సీరియల్స్ షూటింగ్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయ్.