నా బాయ్‌ఫ్రెండ్‌ ఫిబ్రవరి 30 లాంటోడు

‘వర్జిన్‌ భానుప్రియ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఊర్వశీ రౌటెలా. జూన్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడీ. ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఊర్వశీ రౌటెలా కు మీరు నిజ జీవితంలోనూ వర్జిన్ నేనా నా అనే ప్రశ్న ఎదురైంది. దానికి గమ్మత్తైన సమాధానం చెప్పింది ఊర్వశీ రౌటెలా.

“నా బాయ్‌ఫ్రెండ్‌ ఫిబ్రవరి 30 లాంటోడు. అంటే నాకు అసలు బాయ్‌ఫ్రెండే లేడు”అంటూ కొంటెగా సమాధానం ఇచ్చింది. ఇక జులై 16న ‘వర్జిన్‌ భానుప్రియ’ చిత్రం ప్రీమియర్‌ షో ఉంది. అన్నట్టు..  సినిమాలు.. వీడియో ఆల్బమ్స్‌.. వెబ్‌ సిరీస్‌ల్లో ఊర్వశీ రౌటెలా చాలా ఫేమస్. ఇప్పుడు నటిగా బిజీ అయ్యే ప్రయత్నంలో ఉంది.