కరోనాకి మందు కనిపెట్టిన వినాయక్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కరోనాకి మందు కనిపెట్టారు. దానికి గురించి చెబుతూ ఓ వీడియోని విడుదల చేశారు. ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్.. కరోనాకి సరిపోయేలా ఉందని వినాయక్ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఎల్లో ఫీవర్ ఇంక్షన్ ఏంటీ ? దాని గురించి వినాయక్ కి ఎలా తెలిసిందో వీడియో వివరించారు.

“ఓసారి కెన్యా వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ తీసుకునే క్రమంలో ఎల్లో ఫీవర్ లక్షణాల్ని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు కరోనా లక్షణాలుగా ఏవైతే చెబుతున్నారో.. సరిగ్గా అవే లక్షణాలు ఎల్లో ఫీవర్ లో కూడా ఉన్నట్టు నాకు అనిపించింది.

అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎల్లో ఫీవర్ కోసం నేను వేయించుకున్న ఇంజెక్షన్ కరోనాకు పనిచేస్తుందేమో అని నా అనుమానం. ఈ విషయాన్ని ఇద్దరు డాక్టర్లకి తెలిసేందుకు ఈ వీడియోని చేశాను అన్నారు. ఆ ఇద్దరు డాక్టర్లు ఎవరు ? అంటే.. ఇటీవల కరోనా గురించి ఓ డాక్టర్ అద్భుతంగా వివరించారు. ఆయనకి ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ గురించి తెలిసేలా చేయాలన్నది తన కోరిక” అన్నారు.