సుశాంత్ ఆఖరి సినిమా ట్రైలర్ వచ్చేసింది !

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆఖరి సినిమా ‘దిల్‌ బెచారా’. ఈ నెల 24న ఓటీటీలో రిలీజ్ కానుంది. హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ ఎమోషనల్ గా ఉంది.

2014లో హాలీవుడ్‌లో విడుదలైన రొమాంటిక్‌ డ్రామా ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ సినిమాకి రిమేక్‌గా ‘దిల్‌ బెచారా’ను తెరకెక్కించారు. ఇద్దరు క్యాన్సర్‌ పేషెంట్ల మధ్య సాగే ప్రేమ కథ ఇది. సైఫ్‌ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించారు. మే నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.