గంటలో 32 కొవిడ్ పరీక్షలు చేసే మిషన్
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు 20వేలకి పైగా నమోదవుతున్నాయ్. అయితే కరోనా టెస్టులు అధికంగా చేస్తే కరోనా మహమ్మారిని తొందరగా కంట్రోల్ చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టెస్టులని పెంచాలనే ప్రయత్నంలో ఉన్నాయి.
తాజాగా కొవిడ్ టెస్టులని వేగంగా చేసే మిషన్ వచ్చేసింది. భారత కంపెనీలు ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ మెషీన్’ ను ఆవిష్కరించాయి. ఆటోమేటెడ్ టెస్టింగ్ మెషీన్ను పుణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ మెషిన్ గంటకు 32 కొవిడ్ పరీక్షలు చేయగలదు. ఒక మెషిన్ ధర రూ.40 లక్షలని ఎస్ఐఐ సీఈవో వెల్లడించారు.