బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, దేశాధినేతలు కరోనా బారినపడుతున్నారు. తాజాగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో(65)కు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా జైర్ బోల్సోనారోనే తెలిపారు.

‘ఆదివారం అస్వస్థతకు లోనయ్యా. సోమవారం పరిస్థితి మరింత తీవ్రవమైంది. అలసట, జ్వరంతో బాధపడ్డా. కానీ, ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నా. ప్రస్తుతమ్ తాను బాగానే ఉన్నా. మధ్యస్థంగా కరోనా లక్షణాలున్నాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు అజిత్రోమైసిన్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా’నని జైర్‌ బోల్సోనారో తెలిపారు.

ఇక ప్రపంచంలోనే కరోనా కేసుల్లో బ్రెజిల్‌ అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్ తర్వాత స్థానంలో భారత్ ఉంది.