కరోనాతో నయాగద్దర్ మృతి

సాధారణ ప్రజలు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, దేశాధినేతలు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ప్రజాగాయకుడు, ఆర్టీసీ ఎప్లాయీస్‌ యూనియన్‌ నేత సుద్దాల నిస్సార్‌ కరోనా వైరస్‌తో మృతి చెందారు.

నిస్సార్‌ చికిత్స కోసం చాలా ప్రైవేటు ఆస్పత్రులు తిరిగారని, అయినప్పటికీ ఎక్కడా చేర్చుకోలేదని ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి వాపోయారు. చివరికి గాంధీలో చేరితే వెంటిలేటర్‌ సదుపాయం లేక తుదిశ్వాస విడిచారన్నారు.

ఈయూ నేతగా, రచయితగా, ప్రజానాట్యమండలి కార్యదర్శిగా నిస్సార్‌ సేవలందించారన్నారు. నయాగద్దర్‌గా పేరొందిన నిస్సార్‌ మరణం ప్రజా ఉద్యమానికి తీరనిలోటని సీపీఐ కార్యదర్శి నారాయణ అన్నారు. నిస్సార్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.