రామరాజుని కూడా బొక్కలో వేస్తారా ?
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బండారు సత్యనారయణలు అరెస్ట్ అయ్యారు. నకీలీ పత్రాల కేసులు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు అరెస్ట్ కూడా ప్లాన్ జరుగుతున్నట్టు సమాచారమ్.
ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన రఘు రామరాజుకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయ్. దీనిపై రాజు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. వైసీపీ పార్టీ అస్థిత్వాన్నే ప్రశ్నించారు. దీంతో ఆయన్ని వదులుకోవడానికే వైసీపీ రెడీ అయింది. అంతకంటే ముందు ఆయన్న బలహీన పర్చనుంది. ఇందులో భాగంగానే ఈ ఫిర్యాదులు అని తెలుస్తోంది. అంతేకాదు.. రామరాజుని బొక్కలో వేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సమాచారమ్.