తిరుమల కంటోన్మెంట్ జోన్.. కాదు !
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తిరుపతిలోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. టీటీడీలో 80 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో తిరుమలని కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ విడుదల చేసిన కంటోన్మెంట్ జోన్ల జాబితాలో తిరుమల పేరుని ఉంచారు. దీంతో తిరుమల శ్రీవారి దర్శనానికి మరోసారి బ్రేక్ పడనుంది అనుకున్నారు.
అయితే గంట వ్యవధిలోనే తిరుమల కంటోన్మెంట్ జోన్ కాదని అధికారులు తెలపడం విశేషం. తిరుమలలోని ఏపీఎస్పీ బ్యారక్ మాత్రమే కంటైన్మెంట్ జోన్ అని వివరణ ఇచ్చారు. ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో… తిరుమలను కంటైన్మెంట్ జోన్‌గా కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. దీనిపై టీటీడీ అధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో.. తిరుమల కంటోన్మెంట్ కాదు. తిరుమలలోని ఏపీఎస్పీ బ్యారక్ మాత్రమే కంటైన్మెంట్ జోన్ అని సవరణ చేశారు.