రకుల్ ని పెళ్లాడనున్నఆ పొడగరి ఎవరో ?
తన అందం, అభినయంతో యువకుల గుండెల్లో గూడు కట్టుకుంది హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్. టాలీవుడ్లో పాపులారిటీ తెచ్చుకోవడంతోపాటు.. అప్పుడప్పుడు బాలీవుడ్, కోలివుడ్లోనూ తళక్కున మెరుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్..తనకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలిపింది.
‘నాకు కాబోయే వాడు నాకన్న పొడవుగా ఉండాలి. నేను హైహీల్స్ వేసుకున్నా నేను అతడిని తలెత్తుకునే చూడాలి. అంత పొడవుగా ఉండాలి. అలాగే చాలా తెలివైన వ్యక్తి అయి ఉండాలి. జీవితంలో ఏదైనా సాధించి ఉండాలి’ అని చెప్పుకొచ్చింది. మరీ.. రకుల్ ని పెళ్లాడబోతున్న ఆ పొడగరి ఎవరో ? చూడాలి. గతంలో టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటితో రకుల్ కు ఎఫైర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. రకుల్ కోరుకున్నట్టు రానా.. చాలా పొడగరి అన్న సంగతి తెలిసిందే.