వికాస్ దూబే ఎన్‌కౌంటర్.. యూపీలో సంబరాలు !

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ తో యూపీలో పండగ వాతావరణం నెలకొంది. ప్రజలు బాంబులు కాల్చుతూ.. సంబరాలు చేసుకుంటున్నారు. వికాస్ దూబే కరుడుగట్టిన క్రిమినల్. ఎన్నో ఘోరాలు, నేరాలు చేశాడు. ఆయన ఎన్‌కౌంటర్ తో యూపీ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఆనందంలో సంబరాలు చేసుకొంటున్నారు. 

గతవారం 8మంది పోలీసులని కాల్చి చంపిన వికాస్ దూబేని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలించారు. గురువారం మధ్య ప్రదేష్ లోని ఉజ్జయిని ఆలయంలో వికాస్ ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఉదయం ఆయన్ని కాన్పూర్ కు తీసుకువెళ్లే క్రమంలో ఎన్‌కౌంటర్ చేశారు. వాహనంలో తుపాకీ లాక్కునేందుకు జరిగిన పెనుగులాటతో కారు బోల్తా పడిందని… ఈ క్రమంలో వికాస్ దూబేని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని కాన్పూర్ ఐజీ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు.

వికాస్ దూబే ఎన్‌కౌంటర్ పై యూపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఖండిస్తున్నాయ్. గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని పూర్తిగా విచారించకుండానే ఎన్‌కౌంటర్ చేయడం తప్పని విమర్శిస్తున్నారు. ఆయనకి చాలామంది పోలీసులతో సంబంధాలున్నాయనే విషయం తెలిసింది. ఇంకా ఆయన నుంచి పూర్తిగా వివరాలు సేకరించాల్సి ఉంది. ఈలోగా ఎన్‌కౌంటర్ చేయడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయ్. ప్రజలు మాత్రం వికాస్ దూబే ఎన్‌కౌంటర్ సబబేనని పోలీసులని సమర్థిస్తున్నారు.