రూ. 4వేలకి కరోనా ఇంజెక్షన్
మహమ్మారి కరోనాకి ఇంజెక్షన్ వచ్చేసింది. రెమ్డిసివిర్కు జనరిక్ సిప్రెమికి లైన్‌క్లియర్ అయింది. అత్యవసర చికిత్సలో సిప్రెమి వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో దేశీయంగా ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్టు సిప్లా ప్రకటించింది. అంతేకాదు.. ఈ ఇంజక్షన్ ధరని కూడా నిర్ణయించింది. 100 ఎంజీ ఇంజెక్షన్‌ను రూ.4వేలకే విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది.
ఈ ఇంక్షన్ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వార మాత్రమే అందించనున్నారు. తొలుత 80వేల డోసులను సరఫరా చేస్తామని కంపెనీ తెలిపింది. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు కంపెనీ తన వంతు సాయంగా కొంత ఔషధాన్ని విరాళంగా అందించనున్నట్టు తెలిపింది.