‘రాధేశ్యామ్’లో ఎయిర్ టెల్ బ్యూటీ.. పాత్ర ఇదేనట !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20వ సినిమా ‘రాథేశ్యామ్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ ప్రేమకథా చిత్రమ్ లో ప్రేమికులు ప్రభాస్-పూజాల రొమాంటిక్ లుక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు. ఈ సింగిల్ పిక్ తో వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని అర్థమవుతోంది. ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమాలో ఎయిర్ టెల్ బ్యూటీ సశ చేత్రి స్పెషల్ పాత్రలో కనిపించనుందట.

ఈ ప్రచారం చాన్నాళ్ల నుంచే జరుగుతోంది. అయితే తాజాగా సినిమాలో ఆమె పాత్ర ఇదేనని చెబుతున్నారు. రాధ్యేశ్యామ్ లో సశ చేత్రి ప్రభాస్ చెల్లులు పాత్రలో కనిపించనుందట. ఎయిర్ టెల్ యాడ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన సశ చేత్రికి సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదట. అయితే ప్రభాస్ సినిమా అనగానే.. ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు తెలిసింది. ఇక ఈ సినిమాలో సశ చేత్రి ఉందనే విషయాని చిత్రబృందం సస్పెన్స్ గా ఉంచుతోంది. సినిమా రిలీజ్ కి కొద్దిరోజుల ముందు మాత్రమే విషయాన్ని రిలీవ్ చేస్తారట.

ఈ చిత్రానికి జిల్ దర్శకుడు రాథాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూరప్ నేపథ్యంలో సాగే చిత్రమిది. పునర్జన్మల నేపథ్యంలో ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఫస్ట్ లుక్ లో కథకి సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ లో డిజైన్ చూస్తే.. ఈ సినిమా కథ చాలా ఏళ్ల కిందట సాగుతుందని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ బాషలో రాధేశ్యామ్ తెరకెక్కుతోంది.