ఈ ప్రాంతాల్లో మాత్రమే కరోనా గాలి ద్వారా వ్యాపిస్తోంది : WHO
కరోనా వైరస్ గాలిలో వ్యాపిస్తోందన్న వాదనను గత కొంతకాలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తోసిపుచ్చుతూనే ఉంది. కేవలం అత్యవసర పరిస్థితుల్లో రోగులను శ్వాస యంత్రాలపై ఉంచే సందర్భాల్లో మాత్రమే వైరస్ అలా వ్యాపిస్తోందని వాదిస్తోంది. తాజాగా దాన్ని పున:పరిశీలించిన అనంతరం వైరస్ కొన్ని ప్రాంతాల్లో గాలిలో వ్యాపించే ఆస్కారం ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.
తాజాగా దీని గురించి WHO మరింత స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, బృందగానం చేసే ప్రదేశాలు, వ్యాయామ తరగతులు నిర్వహించే ప్రదేశాల్లో మాత్రమే వైరస్ గాలిలో వ్యాపించే అవకాశాలను అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపింది. వైరస్ని వ్యాప్తి చేయగల సామర్థ్యం ఎసింప్టమేటిక్ వ్యక్తులలో ఉన్నప్పటికీ, ఇది చాలా అరుదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పష్టం చేసింది.