సచివాలయ స్థలంలో ఆలయం, మసీద్ నిర్మిస్తాం : కేసీఆర్

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయ్. ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఆలయం, మసీదులు దెబ్బతిన్నాయ్. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. విచారం వ్యక్తం చేశారు. సచివాలయ స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో ఆలయం, మసీదు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

‘ప్రార్థనామందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు.ఎన్నికోట్లయినా వెనుకాడకుండా ఆలయం, మసీదు నిర్మిస్తాం. పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి వాటిని సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తాం.దేవాలయం, మసీదు నిర్వాహకులతో నేనే త్వరలోనే సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నా. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్పూర్తిని కొనసాగిస్తాం’అన్నారు సీఎం కేసీఆర్.