ఇది ట్రైలర్ మాత్రమే.. చంద్రబాబుకు సినిమా చూపిస్తాం !
ట్రైలర్ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ కు పారిపోయాడు తెదేపా అధినేత చంద్రబాబు. వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వరుస ట్విట్స్ చేశారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో తండ్రి-కొడులు చంద్రబాబు, లోకేష్ లపై సటైరికల్ ట్విట్లు చేశారు. ఇప్పుడీ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
‘జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే.’
‘చిట్టి మాలోకం చిన్న మెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది బాబు హయాంలోనే. తొమ్మిదేళ్ల వరస కరువును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మేత దొరకక పశువులను కబేళాలకు అమ్ముకున్న దయనీయ దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. రాజన్న రాకతోనే వ్యవసాయం పండగలా మారింది.’ అంటూ వరుస ట్విట్లు చేశారు విజయసాయి.
జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 10, 2020