‘పెళ్లిగోల బయోపిక్’తో సందేహాలు తీరుస్తా : రేణు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ‘పెళ్లిగోల’ బయోపిక్ తీసేందుకు రెడీ అవుతోంది. ఈ బయోపిక్ ద్వారా పవన్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది. మరో పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకున్నా. ఆ పెళ్లి ఎందుకు చేసుకోలేదు ? అనే సందేహాలని తీరుస్తానని చెబుతోంది.

పవన్ తో విడిపోయాక.. రేణు ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో పూణెలో ఉన్న సంగతి తెలిసిందే. 2018లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పింది. పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. అయితే ఆ తర్వాత రేణు రెండో పెళ్లికి సంబంధించిన అప్ డేటు ఇవ్వలేదు. దీంతో మూడో పెళ్లిపై రేణుని ప్రశ్నిస్తూనే ఉన్నారు నెటిజన్స్. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రేణు.. పెళ్లిగోల పేరుతో ఓ బయోపిక్ తీసి.. అందులో పెళ్లి గురించి క్లారిటీ ఇస్తానని సరదాగా చెప్పింది.

ఒకవేళ రేణు ఇంటర్వ్యూని రామ్ గోపాల్ వర్మ చూశాడంటే.. ఈ కాన్సెప్ట్ ని కచ్చితంగా వాడేసుకొంటాడు. ప్రస్తుతం వర్మ ‘పవర్ స్టార్’ టైటిల్ తో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రేణుని కూడా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పెళ్లిగోల బయోపిక్ ని రేణు తీయకుంటే.. వర్మ కచ్చితంగా తీసేస్తాడు.