టాప్’లోకి దూసుకొచ్చిన బుట్టబొమ్మ

ఏ క్షణాన ‘అల.. వైకుంఠపురంలో’ పాటల ప్రస్థానాన్ని మొదలెట్టారో గానీ.. టన్నుల కొద్ది రికార్డులు కొల్లగొడుతున్నాయ్. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అల.. వైకుంఠపురంలో. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా కంటే ముందే అల.. పాటలు హిట్టైపోయాయ్. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యంగా నిలిచాయ్.

తాజాగా బుట్టబొమ్మ పాట టాప్ లోకి దూసుకొచ్చింది. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకొన్న మొదటి తెలుగు వీడియో సాంగ్ గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించారు. థమన్ సంగీతం అందించారు. జానీ మాస్టర్ నృత్యరీతులని సమకూర్చారు. పాట-ఆట అద్భుతంగా కుదరడంతో.. బుట్టబొమ్మ ప్రపంచవ్యాప్త సినీ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఏకంగా టాప్ లోకి దూసుకొచ్చింది.