చరణ్ అవస్థ చూశారా ?
కరోనా లాక్‌డౌన్ తో సినీ ప్రముఖులు ఇంటికే పరిమితం అయ్యారు. కుటుంబంలో హాయిగా గడుపుతున్నారు. అయితే ఈ కరోనా హాలీడేస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో బాగా బద్దకం పెరిగినట్టుంది. శుక్రవారం చరణ్ జిమ్ చేస్తున్న ఫోటోలని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘బుర్ర జిమ్ చేయమంటోంది.. మనసు మాత్రం వద్దంటోంది’ అంటూ కామెంట్ పెట్టింది. రెండ్నెళ్ల పాటు గ్యాప్ రావడంతో చరణ్ లో బద్దకం పెరిగినట్టు ఆయన తాజా ట్విట్ తో అర్థమవుతోందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కనిపించనున్నారు. చరణ్ బర్త్ డే కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుంచి భీమ్ ఫర్ రామరాజు టీజర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరిగా మండే నిప్పుకణంలా కనిపించారు చరణ్. కరోనా ప్రభావంతో ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడింది. ఇటీవల షూటీంగ్స్ కి అన్నీ రెడీ చేసుకొన్నా.. కరోనా విజృంభణ తగ్గకపోవడంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం వెనక్కి తగ్గింది.
Head say gym💪 &
Heart says 🤔hmmmm… pic.twitter.com/zoNNHz6Sxt— Ram Charan (@AlwaysRamCharan) July 10, 2020