హాలీవుడ్’కు నో చెప్పిన దిశా.. ఎందుకంటే ?

హాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే.. ఏ హీరోయిన్ అయినా ఎగిరిగత్తేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ మాత్రం హాలీవుడ్ కి నో చెప్పినట్టు తెలిసింది. దీనికి కారణమేంటీ అంటే.. ? బాలీవుడ్ ని దున్నేయాలన్నది దిశా కోరిక అట. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ కి జోడిగా ‘రాధే’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోవడం ఖాయమని దిశా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె హాలీవుడ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. 

ఇక లోఫర్ సినిమాతో దిశా పటానీ తెలుగు తెరకు పరిచయం అయింది. ధోని బయోపిక్ తో రెండోసారి తెలుగు ప్రేక్షకులని అలరించింది. సుకుమార్-అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ చిత్రం పుష్ప సినిమాలోఐటమ్ సాంగ్ లో దిశా మెరవనుందనే ప్రచారం జరుగుతోంది. ఐటమ్ సాంగ్స్ తీయడంలో సుకుమార్ స్పెషలిస్ట్. పుష్ప ఐటమ్ తో దిశాకి మంచి పేరు రావడం ఖాయమని చెప్పుకొటున్నారు.