50 గంటల కఠిన లాక్‌డౌన్

దేశంలో కరోనా విజృంభిస్తోంది. అయినా మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ విదిస్తున్నాయ్. ఇప్పటికే తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ ని విధించారు. ఇక పూణెలోనూ సంపూర్ణ లాక్‌డౌన్ ని అమలు చేస్తున్నారు. తాజాగా యూపీ ప్రభుత్వం కూడా 50గంటల కఠిన లాక్‌డౌన్ ని ప్రకటించింది.

శుక్రవారం రాత్రి 10గంటల నుంచి యూపీలో లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చేసింది. పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర దుకాణాలు మినహా ఇతర షాపులన్నీ మూతపడ్డాయి. నగరాల్లోని చాలా ప్రాంతాలను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఇక యూపీలో ఇప్పటి వరకు 32,362 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. 21,127 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 862 మంది కరోనాతో మృతి చెందారు.