టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు ఊరట…
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు పౌరసత్వం విషయంలో కాస్త ఊరట లభించింది. ఆయన పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లపై కోర్టులో విచారణ సాగుతోంది. గత కొంత కాలంగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక ఎమ్మెల్యే చెన్నమనేనికి పదవీ గండం ఖాయమని భావించారు అంతా. తన పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు చెన్నమనేని కూడా కోర్టుకెక్కారు.
తాజాగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దుపై కేంద్రప్రభుత్వం ఇచ్చిన రెండు ఆర్డర్లను ఆరువారాల పాటు సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. మళ్లీ వాదనలు వింటామని స్పష్టం చేసింది. దీంతో చెన్నమనేనికి ఈ విషయంలో కాస్త ఊరట లభించినట్లైంది. పూర్తి సమాచారంతో మళ్లీ తన వాదనలు వినిపించేందుకు అవకాశం దక్కింది.