పవర్ స్టార్ తో బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఫ్యాన్స్ కాదు. భక్తులుంటారు. బండ్ల గణేష్ మాత్రం భక్తుల కంటే ఎక్కువ. భజనపరుడు. ఆయన ఏ చిన్ని అవకాశం వచ్చినా.. పవన్ మా బాస్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తాడు. బండ్ల పొగడ్తలకి పవన్ కూడా పడి పడి నవ్విన సందర్భాలున్నాయ్. అలాంటి బండ్లని కూడా పవర్ స్టార్ సినిమాలో చూపించబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ.

పవర్ స్టార్ పేరిట వర్మ ఓ సినిమాని తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ ని చూపించబోతున్నారు. త్రివిక్రమ్ మాత్రమే కాదు.. నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ లో కనిపించబోతున్నారట. ఏపీ ఎన్నికల అనంతరం జరిగిన కథ అంటూ చెప్పిన బండ్ల పవర్ స్టార్ లో బండ్ల గణేశ్ ఎలా చూపిస్తారు ? తనతో మరో సినిమా చేయాలని పవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే సీన్ ఏమైనా అల్లుకున్నాడేమో !