బిగ్ బ్రేకింగ్ : అమితాబ్’కు కరోనా పాజిటివ్

సెలబ్రిటీలు కూడా కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కరోనా బారినపడ్డారు. మూత్ర పిండాల నొప్పితో ముంబైలోని నానావతి సినిమాలో చేరారు బిగ్ బీ. ఆయనకి కరోనా టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు దృవీకరించాయి.

తనకి కరోనా సోకిన విషయాన్ని అమితాబ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నానని తెలిపారు. అంతేకాదు.. గత 10రోజులుగా తనని కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని అమితాబ్ కోరారు. ఇక నానావతి ఆసుపత్రి వర్గాలు అమితాబ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెబుతున్నారు. అమితాబ్ కు కరోనా అని తెలిసి.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.