గాంధీ ఆసుపత్రికి ర్యాపిడ్‌ వైరస్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబో

తెలంగాణలో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి కరోనా చికిత్సకి ప్రధాన కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా గాంధీకి మొబైల్‌ ర్యాపిడ్‌ వైరస్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబో వితరణగా వచ్చింది. సుమారు రూ.12లక్షల విలువైన రోబోను గాంధీ ఆసుపత్రికి రీవాక్స్‌ ప్రతినిధులు అందించారు. యూవీరోవా బీఆర్‌ రోబోను తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కంపెనీ ప్రతినిధులు అందించారు.

యూవీరోనా బీఆర్‌ రోబో ద్వారా ఎలాంటి రసాయనాలు లేకుండానే డిస్‌ఇన్‌ఫెక్షన్‌ చేయొచ్చు. ఐసీయూ పడకలు, ఆ ప్రాంతాన్ని ఐదు నిమిషాల్లోనే రోబో డిస్‌ఇన్‌ఫెక్షన్‌ చేయనుంది. ఈ సందర్భంగా రీవాక్స్‌ ఫార్మా కంపెనీ ప్రతినిధులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.