అవమానం జరిగిందంటూ లోక్ సభలో కడప ఎంపీ ఫిర్యాదు..!
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తనకు అవమానం జరిగిందంటూ లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ కకు పిర్యాదు చేశారు ఆయన. కడపలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను అవమానించారని ఆయన ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ సీఎం తన చేతిలో మైకు లాక్కునే ప్రయత్నం చేశారని , ఒక రౌడీ షీటర్ వేదికపై ఉండటమే కాకుండా.. తన మైక్ లాక్కుని దౌర్జన్యానికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన .గౌరవానికి భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.