అమితాబ్ కోసం ప్రార్థించను : వర్మ


బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మంచి సాన్నిహిత్యం ఉంది. వీరి కాంబోలో సర్కార్ సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే. సర్కార్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. సర్కార్ 2 మాత్రం ఆడలేదు. ఇక వర్మని బిగ్ బీ ఇంటి మనిషిగా చూస్తారు. అలాంటి బిగ్ బీ కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుటే.. ఆయన కోలుకోవాలని ప్రార్థించనని ఆర్జీవీ ట్విట్ చేశారు.

“మీరు కరోనా నుంచి కోలుకుంటారని నాకు తెలుసు. ఎప్పటిలాగే మరింత బలంగా తిరిగి వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకే మీ కోసం నేను ప్రార్ధించను. కరోనా కారణంగా చనిపోతున్న వారి కోసం ప్రార్థిస్తాను” అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇక కరోనా బారినపడిన అమితాబ్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, అభిమానులు ట్విట్ చేస్తున్నారు. అభిమానులు యజ్ఝ-యాగాలు చేస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మహేశ్, నాగ్ తదితరులు అమితాబ్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.