కార్పోరేటర్ కు జీహెచ్ఎంసీ యాభైవేల జరిమానా..!!
నిబంధనలకు ఎవ్వరూ అతీతం కాదని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. అది సామాన్యుడైనా, విపక్షాలైనా, అధికారపక్షాలైనా , ఎవరైనా సరే రూల్స్ పాటించాల్సిందేనంటోంది. హైదరాబాద్ నగరంలో ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నిషేధం విధించింది జీహెచ్ఎంసీ. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారికి జరిమానాను విధిస్తోంది కూడా.
మలక్ పేట ఇండొర్ స్టేడియం ప్రారంభం సందర్భంగా నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్షీలు కట్టారు స్థానిక నేతలు. దీంతో ఈ చర్యలకు పాల్పడిన స్థానిక కార్పొరటర్ సుచరితా రెడ్డికి యాభైవేలు, మాజీ కార్పొరటర్ అస్లాం కు 25వేలు,టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ కు25వేల జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశించారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ప్రభుత్వం ఎంత నిబద్ధతగా ఉందో ఈ సంఘటన ద్వారా ప్రజలకు సందేశాన్ని పంపిచారు మంత్రి కేటీఆర్..