కాంట్రాక్ట్ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం
ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పంటపడింది. వారికి సకాలంలో జీతాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల స్థితిగతులపై సీఎం జగన్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ శశిభూషణ్, కార్మిక శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు అందించాలని సీఎం జగన్ అధికారులని ఆదేశించారు. అంతేకాదు.. గవర్నమెంట్ ఉద్యోగుల్లాగానే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు.