నాగశౌర్య కసరత్తులు చూశారా.. ?
లాక్ డౌన్ సమయంలో షూటింగులన్నీ బంద్ అయ్యాయి. మళ్లీ సినిమాల హడావుడి ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ఈ ఖాళీ సమయాన్ని సినీ తారలు వాడుకుంటున్నారు. నచ్చిన పనులు చేసుకొంటున్నారు. కొత్త పనులు నేర్చుకొంటున్నారు. ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా జిమ్ లో నాగశౌర్య కసరత్తులు చేస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోని చూస్తే.. నాగశౌర్య మాస్ కథలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా తన బాడీ సిద్ధం చేసుకుంటున్నాడనిపిస్తోంది.
ఈ యేడాది అశ్వద్ధామ సినిమాతో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగశౌర్య. ఈ సినిమా కోసం నాగశౌర్య రచనా సహకారం కూడా అందించారు. విశాఖలో అమ్మాయిల కిడ్నాప్ నేపథ్యంలో తెరకెక్కిన అశ్వద్దామ మంచి సినిమా అనిపించుకుంది. నాగశౌర్యలోని మాస్ యాంగిల్ ని చూపించింది. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో రెండు కథల్ని ఓకే చేశాడు శౌర్య. కలం పట్టి ఓ స్క్రిప్టు కూడా పూర్తి చేశాడు. వాటి వివరాలు తెలియాల్సి ఉంది.
I dont stop when im tired, i stop when im done #staystrong #getfit #fitnessmotivation pic.twitter.com/yW9fST0Q9B
— Naga Shaurya (@IamNagashaurya) July 13, 2020