అమితాబ్ క్షేమం
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అమితాబ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలకి కరోనా పాజిటివ్ గా నిర్థారణయింది. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితమే బిగ్ బీ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు స్పందించాయి.
అమితాబ్ కు చాలా తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయని, తక్కువ మోతాదులో మందులు ఇస్తున్నామని తెలిపిన వైద్యులు.. ట్రీట్ మెంట్ కంటే అబ్జర్వేషన్ కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అమితాబ్ కి కరోనా ట్రీట్ మెంట్ అవసరం లేదని తెలిపారు. అభిషేక్ బచ్చన్ కు ఇంకా తక్కువ మోతాదులో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అభిషేక్ కు జ్వరం కూడా లేదని స్పష్టంచేశారు. మరో 5 రోజుల పాటు వీళ్లిద్దర్నీ అబ్జర్వేషన్ లో ఉంచి, ఆ తర్వాత మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
ఇక ఐశ్వర్యారాయ్, ఆమె కూతురు ఆరాధ్య ఇంట్లోని చికిత్స తీసుకుంటున్నారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో, హాస్పిటల్ చేరి వైరస్ సోకే రిస్క్ ను మరింత పెంచుకునే కంటే ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకోవడం ఉత్తమమని సూచించారు. దీంతో ఐశ్వర్య-ఆద్య ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇక జయాబచ్చన్, శ్వేతా బచ్చన్, ఆమె పిల్లలకు టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది.