రెండ్నెళ్ల ముందే పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ షురు


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే (సెప్టెంబర్ 2) సెలబ్రేషన్స్ రెండు నెలల ముందు నుంచి మొదలైపోయాయ్. సోమవారం రాత్రి నుంచి #AdvanceHBDPawanKalyan యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. గంటల వ్యవధిలోనే 10మిలియన్ ట్విట్స్ పడ్డాయ్. ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పవన్ హవాకి ఇదొక చిన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇక పవర్ స్టార్ జోరుకి కరోనా బ్రేకులేసింది. ‘వకీల్ సాబ్’తో పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తో పాటు మరో రెండు సినిమాలని పవన్ లైన్ లో పెట్టేశారు. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా ఇప్పటికే ప్రారంభం అయింది. పిరియాడిక్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత గబ్బర్ సింగ్ కాంబో ఓ సినిమా రాబోతుంది. హరీష్ శంకర్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.