గాంధీలో కరోనా టెస్టులు ఎందుకు చేయడం లేదు ?
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గాంధీలోనూ కరోనా పరీక్షలు జరపాలని కోర్టు ఆదేశించింది. అధిక బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. రూ.4 లక్షలకు పైగా బిల్లు వేసిన యశోద, కిమ్స్ తదితర ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రైవేటు కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ఠ ఛార్జీలు ఖరారు చేయాలని ఆదేశించింది. ఆస్పత్రుల్లోని బెడ్లు, వెంటిలేటర్ల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని పేర్కొంది. హైదరాబాద్లోని నాచారం ఆస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తారో? లేదో? చెప్పాలని కోరింది. ఈ నెల 27లోపు కరోనాకు సంబంధించిన పూర్తి నివేదికని సమర్పించాలని కోర్టు ఆదేశించింది.