‘పవర్ స్టార్’ ట్రైలర్’ని చూడాలన్న డబ్బులు చెల్లించాల్సిందే !


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫుల్లుగా వాడుకుంటున్నారు. ఆయన ‘పవర్ స్టార్’ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ని పోలిన వ్యక్తిని హీరోగా పెట్టాడు. పవన్ ఫ్యామిలీ, స్నేహితులు, కొంతమంది ఇండస్ట్రీ జనాలని సినిమాలో చూపించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉండనుంది. పవన్ స్నేహితుడు, త్రివిక్రమ్ ఉన్నాడు.

ఏపీ ఎన్నికల తర్వాత అంటూ పవర్ స్టార్ సినిమాపై అంచనాలు పెంచేశాడు వర్మ. పవన్ కల్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘తొలిప్రేమ’ విడుదలైన జూలై 24న ‘పవర్‌స్టార్’ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈలోగా టీజర్, ట్రైలర్ ని వదలనున్నాడు. అయితే వీటిని చూడ్డానికి కూడా వర్మ డబ్బులు వసూలు చేయనున్నాడు. పవర్ స్టార్ ట్రైలర్ ని ఒక్కసారి చూడాలంటే రూ. 50 చెల్లించాల్సిందే. పవన్ ఫ్యాన్స్ చూడకున్నా.. మిగితా హీరోల అభిమానులు చూస్తారని ట్రైలర్ కి కూడా వర్మ డబ్బులు వసూలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.