పవన్ బర్త్ డే గిఫ్ట్ రెడీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పీడుకు కరోనా బ్రేకులు వేసింది. ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇవ్వబోతున్న వరుస సినిమాలని లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, హరీష్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఈ మూడు కాకుండా మరో రెండు కథలు చర్చలు దశలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇంతలో కరోనా విజృంభించడంతో పవన్ స్పీడుకు బ్రేక్ పడినట్టయింది.

ఇప్పటికే వకీల్ సాబ్ దాదాపు 50శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ నేపథ్యలో పవన్ బర్త్ డే (సెప్టెంబర్ 2) కానుకగా వకీల్ సాబ్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు తెలిసిందే. రెండ్నెళ్ల ముందే పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని అభిమానులు మొదలెట్టారు. #AdvanceHBDPawanKalyan యాష్ ట్యాగ్ ని ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు. వారిని డిస్సాపాయింట్ చేయకుండా బర్త్ డే కానుకగా వకీల్ సాబ్ టీజర్ ని రెడీ చేసే ఆలోచనలో చిత్రబృందం ఉంది. అందుకు పవన్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారమ్.