‘జియోఫోన్‌ 3’ లాంచ్ నేడే !

ఇప్పటికే రిలయన్స్ జియో నుంచి జియోఫోన్, జియోఫోన్ 2 వచ్చేశాయి. తాజాగా జియోఫోన్ 3 రాబోతుంది. ఈరోజే జియోఫోన్ 3 ని లాంఛ్ చేయబోతున్నారు. ఈరోజు జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో దీన్ని ఆవిష్కరించనున్నారు. జులై 21, 2017లో 40వ ఏజీఎంలో తొలి జియోఫోన్‌ను ముఖేశ్‌ అంబానీ ఆవిష్కరించగా.. 2018లో 41వ ఏజీఎంలో జియోఫోన్‌2ని విడుదల చేశారు.

ఇక జియోఫోన్ 3  సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలు తెలియాల్సి ఉంది. 64 జీబీ అంతర్గత మెమొరీ, 5 ఎంపీ కెమెరా, 5 అంగుళాల డిస్‌ప్లేతో ఇది రానున్నట్లు సమాచారం.