వాట్సాప్ పని చేయడం లేదు

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌ డౌన్ అయింది. యాప్ అప్లికేషన్ ఓపెన్ కావట్లేదు. బుధవారం తెల్లవారుజామున వాట్సాప్‌ డౌన్ అయింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాట్సాప్‌ డౌన్ అయిందని పలువురు నెటిజన్స్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ సమస్యపై వాట్సాప్ కంపెనీ వారు మాత్రం స్పందించలేదు.

సాంకేతికలోపం కారణంగానే వాట్సాప్‌ డౌన్ అయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత చాలాసేపటికి వాట్సాప్ ఓపెన్ అయింది. ప్రస్తుతానికి బాగానే పని చేస్తోంది. అయితే ఆ వాట్సాప్‌ డౌన్ అయిన ఆ కొద్ది నిమిషాల్లో యూజర్లకి ప్రాణం పోయినట్టు అయింది. అంతగా వాట్సాప్ డైలీ లైఫ్ లో భాగమైంది.