స్కూల్స్ ఓపెనింగ్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా ప్రభావంతో విద్యాసంస్థలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. మార్చి 14 నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలన్నీ రద్దయ్యాయ్. పోటీ పరీక్షలని కూడా వాయిదా వేశారు. ఇప్పట్లో కరోనా ప్రభావం తగ్గేలా లేదు. విద్యాసంస్థలు తెరచుకొనే పరిస్థితుల్లేవ్. ఈ నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరం ఉంటుందా ? ఉండదా ? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారమ్.

టీశాట్, నిపుణ ఛానెల్ ద్వారా విద్యని అందించాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారమ్. ఇప్పటికే కేంద్రం ఆన్  లైన్ క్లాసులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ని కూడా  విడుదల చేసింది. 1 నుంచి 8 తరగతుల వరకు రోజుకి రెండు క్లాసులు. అది కూడా 35 నుంచి 45 నిమిషాలు ఉండాలని హెచ్ఆర్ డీ సూచించింది.

ఇక 9 నుంచి 12 తరగతుల వారికి రోజుకి 4 సెషన్స్ నిర్వహించవచ్చని తెలిపింది. ప్రైమరీ (ఎల్కేజీ, యూకీజీ) పిల్లలకి మాత్రం రోజుకి అరగంట మాత్రమే ఆన్ లైన్ లో క్లాసులు తీసుకోవాలని గైడ్ లైన్స్ లో తెలిపింది. అయితే ఆన్ లైన్ విద్యలో ప్రాక్టీకల్ ప్రాబ్లస్ చాలానే ఉన్నాయి. పేద విద్యార్థులు, గవర్నమెంట్ స్కూళ్లలో చదివి విద్యార్థులకి ఆన్ లైన్ విద్య భారం కానుంది. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉంటే ఎలా ? వారికి ల్యాప్ టాప్ లని ఎలా సమకూరుస్తారు అని న్యాయం ప్రశ్నిస్తోంది.

మరోవైపు ప్రయివేటు స్కూల్స్ మాత్రం ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులని ప్రారంభించాయ్. ఫీజులని కూడా గుంజుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారమ్. ఇందులో భాగంగా టీశాట్, నిపుణ ఛానెల్ ద్వారా విద్యను అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఆన్ లైన్ విద్యపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.