గాంధీలో నిరవధిక సమ్మె
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులు మంగళవారం ఆందోళనకి దిగిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెని కొనసాగించాలని ఉద్యోగులు నిర్ణయించారు. ఈరోజు నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. పొరుగు సేవలు, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది తమ ఉద్యోగులని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బేసిక్ సాలరీ రూ. 20వేలు ఇవ్వాలని అడుగుతున్నారు.
కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆందోళనకి దిగిన గాంధీ కాంట్రాక్ట్ ఉద్యోగులకి ప్రజల మద్దతు ఏ మేరకు లభిస్తుంది ? అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు బేషజాలకి పోకుండా గాంధీ హాస్పటల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెని విరమింపజేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారమ్. మరోవైపు, గాంధీలో కరోనా టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.