కోహ్లీ కంటే విలియమ్ సన్ బెస్ట్ !
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్ సన్ ఇద్దరూ.. ప్రపంచంలోని అత్యత్తమ బ్యాట్స్ మెన్స్ లో ఒకరిగా ఉన్నారు. కోహ్లీ 86 టెస్టుల్లో 53.62 సగటుతో 7240 పరుగులు చేయగా, విలియమ్సన్ 80 టెస్టుల్లో 6416 పరుగులు చేసి 51.63 సగటు సాధించాడు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే.. ? విలియమ్ సన్ అన్నారు కివీస్ మాజీ బ్యాట్స్ మెన్ గ్లెన్ టర్నర్. దీనికి గల కారణాలు కూడా టర్నర్ వివరించారు.
కఠినమైన బ్యాటింగ్ పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయలేడు. విలియమ్ సన్ కంటే కోహ్లీ మరింత దూకుడుగా కనపడుతున్నప్పటికీ, గెలవటానికి ఉన్న తపన మాత్రం ఇద్దరిలో సమానంగా ఉంటుంది. కోహ్లీ సీమింగ్ పిచ్‌లు మరియు బ్యాటింగ్ కు సహకరించే పిచ్ లపైనే ఎక్కువ ఆడాడు, అయితే విలియమ్సన్ స్వింగ్ మరియు సీమర్‌లకు అనుకూలమైన పరిస్థితులలో ఆడాడు. అందుకే కఠినమైన పరిస్థితులలో బ్యాటింగ్ చేయడానికి విలియమ్ సన్ ని ఎంచుకుంటా అన్నారు టర్నర్.