బీజేపీకి షాక్ ఇచ్చిన సచిన్ పైలట్
రాజస్థాన్ కాంగ్రెస్ రెబల్ సచిన్ పైలట్ పై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. సచిన్ పైలట్ ని ఆహ్వానించడానికి భాజాపా శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ ప్రకటించింది. అయితే సచిన్ మాత్రం బీజేపీకి షాక్ ఇస్తూ.. ఆ పార్టీలో చేరడం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన భవిష్యత్ కార్యచరణని ప్రకటించడానికి మరికొద్దిసేపట్లో సచిన్ పైలట్ మీడియా ముందుకు రానున్నారు.
కాంగ్రెస్ లో ఉండకుండా, భాజాపాలో చేరకుండా సచిన్ పైలట్ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొత్తం 200 మంది ఎమ్మెల్యేలున్నా రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 30 మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ బృందంలో ఉన్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ బృందంలో 80 నుంచి 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు చెబుతున్నారు.