బుట్టబొమ్మ గాల్లో తేలిపోతోందిగా.. !

టాలీవుడ్ లో హీరోయిన్ పూజా హెగ్డే హవా కొనసాగుతోంది. ఆమె వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ లతో రొమాన్స్ చేసింది. బన్నీతో అయితే రెండు సార్లు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రేమలో మునిగిపోయింది. వీరిద్దరు జంటగా రాథాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

‘అల.. వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది పూజా. కెరీర్ లో హిట్, బ్లాక్ బస్టర్  హిట్స్ రావడం సహజమే. కానీ అల.. అలా కాదు. పూజా హెగ్డేని బుట్టబొమ్మని చేసింది. ఆమె కాళ్లని పట్టుకొని వదలమని వేడుకొనేలా చేసింది. ఇంకా మాటలో చెప్పాలంటే.. పూజాని మహారాణిని చేసిన చిత్రమిది. ఇప్పటికీ అల.. పాటలు రికార్డుల మోత మ్రోగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గాల్లో తేలిపోతోంది పూజా. ఆ విషయాన్ని చెబుతూ.. ఓ ఫన్నీ ఫోటోని పంచుకొంది పూజా. తలక్రిందులుగా పోజు పెట్టి. కాళ్లు గాల్లో ఉన్నాయని తెలిపింది. ఆ ఫోటోని మీరు చూసేయండీ.. !