ఒక్కరోజే 32,695 కొత్త కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగూనే ఉంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతున్నాయ్. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 32,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. ఉ. ఒకేరోజు ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. మరో 606 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 9,68,876కు చేరింది. ఇప్పటి వరకు 24,915 మంది కరోనాతో మృతి చెందారు.
ప్రస్తుతం మొత్తం కరోనా బాధితుల్లో 6,12,815 మంది కోలుకోగా మరో 3,31,146 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 63శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా మరణాల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలోనే 2,75,640 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10,928 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలో 3487 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా, తమిళనాడులో 2167, గుజరాత్‌లో 2079, ఉత్తర్‌ప్రదేశ్ 1012, పశ్చిమ బెంగాల్‌లో 1000 మంది మృత్యువాతపడ్డారు.